logo

మా కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారు: పవన్‌పై మండిపడ్డ ముద్రగడ

‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం..

Published : 07 May 2024 05:58 IST

కిర్లంపూడి: ‘ఇటీవల మా కుటుంబంలో చిన్న చిచ్చు రేగిన సంగతి బాధాకరం. అయినా భయపడను. ఎలాగూ నా కుమార్తెను రోడ్డుపైకి లాగారు. ఆమెతో ఇంటర్వ్యూలు ఇప్పించడం, స్టూడియోలకు పంపించి డిబేట్లలో పాల్గొనేటట్లు చేయడం, పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేయించినా బాధపడన’ని మాజీ మంత్రి, వైకాపా నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ రోజు సంస్కారం వదిలేసి మాట్లాడుతున్నానంటూ పవన్‌పై తీవ్ర పదజాలంతో విమర్శించారు.

తనకు ఎక్కువ గౌరవమిస్తున్నట్లు నటిస్తూ తన కుటుంబాన్ని అప్రతిష్ఠ పాలుజేయాలని చూస్తున్నారన్నారు. గతంలో పెద్దలు ఒక మాట అన్నా పడాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారని.. తాను ఎప్పుడూ మీ గురించి, మీ అన్న చిరంజీవి గురించి ఏమీ మాట్లాడలేదన్నారు. కాకినాడ సభలో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ తనను ఎందుకు నిందించారని, తిట్టాల్సిన పని ఏమి వచ్చిందని ముద్రగడ ప్రశ్నించారు. నా కుమార్తెను తుని సభలో ముద్రగడ పద్మనాభం కుమార్తె అని ఎందుకు పరిచయం చేశారంటూ నిలదీశారు. ‘ఆమె నా సొత్తు కాదు, నా ఇంటి పేరు లేదు.. ఆమె మామ, భర్త ఇంటి పేరున పరిచయం చేయాల్సిందని.. సభలో నా పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది పద్ధతేనా.. సంస్కారం లేదా?’ అంటూ ముద్రగడ పవన్‌ కల్యాణ్‌పై మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు