logo

ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌

సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు.

Published : 07 May 2024 04:20 IST

ఓటింగ్‌ను పరిశీలిస్తున్న కలెక్టరు మాధవీలత, జేసీ తేజ్‌భరత్‌

ధవళేశ్వరం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్న పీవో, ఏపీవో, ఫొటోగ్రాఫర్‌లు, వీడియోగ్రాఫర్‌లు, ఇతర సిబ్బందికి నిర్వహించిన పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని కలెక్టరు మాధవీలత తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలోని పీవో, ఏపీవోలకు నియోజకవర్గాల్లో శిక్షణ నిర్వహించామన్నారు. ఆ మేరకు ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే వారితోపాటు ఇతర అత్యవసర సేవలు నిర్వహించే 32 విభాగాలకు చెందిన వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించామన్నారు. జేసీ తేజ్‌భరత్‌ మాట్లాడుతూ.. రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గ పీవో, ఏపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పోలింగ్‌ రోజు సాయంత్రం 6 గంటల వరకు లైనులో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలన్నారు. నోడల్‌ అధికారి ఆర్‌.కృష్ణనాయక్‌ సమక్షంలో పోస్టల్‌ బ్యాలెట్లను భద్రపరచి సీల్‌ వేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు