logo

చంద్రన్న మాటే మాదిగలకు బాట

వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్‌ కోరారు.

Published : 07 May 2024 04:21 IST

కరపత్రాలు ఆవిష్కరిస్తున్న నాయకులు

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో దళితులను హింసించిన, హత్యలు చేసిన వారిపై కూటమి అధికారంలోకి రాగానే కమిటీ వేసి శిక్షించాలని రాష్ట్ర మాదిగ మహానాడు వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మిట్టా శ్రీకాంత్‌ కోరారు. సోమవారం కొవ్వూరు తెదేపా కార్యాలయంలో ద్విసభ్య కమిటీ సభ్యుడు కంఠమణి రామకృష్ణ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ‘చంద్రన్న మాటే మాదిగలకు బాట’ అనే నినాదంతో రూపొందిన కరపత్రాలను ఆవిష్కరించారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ.. గడిచిన అయిదేళ్లలో దళితులు, బహజనులు హత్యలకు, అవమానాలకు గురయ్యారన్నారు. నిధులివ్వకుండా ఓ కార్పొరేషన్‌ పెట్టి మోసం చేశారన్నారు. అందుకే మాదిగలంతా కూటమికి మద్దతిస్తున్నారన్నారు. పురపాలక మాజీ ఛైర్మన్‌ సూరపనేని చిన్ని, మద్దిపట్ల సురేష్‌, అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోడపాటి బాజి, జిల్లా అధ్యక్షుడు పసలపూడి జోషి, నియోజకవర్గ అధ్యక్షుడు ఇంగుడుమెల్లి రమేష్‌, మండల అధ్యక్షుడు పసలపూడి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని