logo

కళ్లముందున్నా.. కోడ్‌ ఉల్లంఘన కనరు..!

మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నా ఇప్పటికీ కోడ్‌ ఉల్లంఘనలపై అధికారులు దృష్టిసారించడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శం. కోడ్‌ పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

Published : 09 May 2024 04:52 IST

రో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నా ఇప్పటికీ కోడ్‌ ఉల్లంఘనలపై అధికారులు దృష్టిసారించడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శం. కోడ్‌ పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. రాజమహేంద్రవరం గ్రామీణంలోని బాలాజీపేట కూడలిలో ఉన్న బస్‌షెల్టర్‌పై ముఖ్యమంత్రి జగన్‌ చిత్రానికి ఎటువంటి ముసుగులు లేకుండా బాహాటంగా కనిపిస్తున్నా పట్టించుకునే అధికారే లేరు. నిత్యం ఈ మార్గం గుండానే అధికారులంతా రాకపోకలు సాగిస్తుంటారు. సీఎం చిత్రాలపై ఏదో మొక్కుబడిగా కాగితాలు అతికించి చేతులు దులుపుకొంటున్నారు. అవి ఎండకు ఎండి, వానకు తడిచి తొలగిపోతున్నాయి.  

న్యూస్‌టుడే, బొమ్మూరు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని