logo

ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న కూటమి నేతలు

సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపులో బుధవారం సాయంత్రం తెదేపా, జనసేన, భాజపా నేతలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లోడింగ్‌తో ఉన్న లారీలను నిలిపివేశారు.

Published : 09 May 2024 04:54 IST

మునికూడలిలో తవ్వకాలు అడ్డుకున్న నాయకులు

సీతానగరం, న్యూస్‌టుడే: సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపులో బుధవారం సాయంత్రం తెదేపా, జనసేన, భాజపా నేతలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లోడింగ్‌తో ఉన్న లారీలను నిలిపివేశారు. తవ్వకాలను చేసే ప్రొక్లెయిన్లకు అడ్డుగా నిలబడ్డారు. రాజమహేంద్రవరం గనులశాఖ ఏడీ సుబ్రహ్మణ్యం సమాచార హక్కుచట్టంలో ఇచ్చిన దస్త్రాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూలీలతోనే మీటరు లోతున తవ్వకాలు చేయాలని ఉందన్నారు. కాని రేవులో నాలుగైదు యంత్రాలను దించి 30 నుంచి 40 మీటర్ల పైబడి లోతున తవ్వేస్తున్నారని ఆందోళన చేశారు. దీంతో రేవులో తవ్వకాలు నిలిచిపోయి ఇసుక లారీలు ఆగిపోవడంపై రేవు నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరారు. తవ్వకాలు అడ్డుకోవడం తగదని వెంటనే అక్కడ నుంచి వెళ్లిపోవాలని కూటమి శ్రేణులకు ఎస్సై సూచించారు. ఈ సమస్యను గనులశాఖ, రెవెన్యూ పరిష్కరించాల్సి ఉందని వారికి తెలిపారు. ఆయా శాఖల అధికారులు వచ్చేవరకు రేవు వద్దనే ఉంటామని యంత్రాలతో తవ్వకాలు నిలిపివేసి కూలీలకు ఉపాధి కల్పించాలని కూటమి నేతలు డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని