logo

అటు ఎన్నికలు.. ఇటు సెలవులు

ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్‌ రిజర్వేషన్‌ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది.

Published : 10 May 2024 05:07 IST

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం): ఇటు ఆర్టీసీలో, అటు రైల్వేలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. దూరప్రాంత సర్వీసులకు టికెట్‌ రిజర్వేషన్‌ దొరకని పరిస్థితి నెలకొంది. వరుస సెలవులు.. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో మరింత రద్దీ పెరగనుంది. ముఖ్యంగా ఆర్టీసీలో హైదరాబాద్‌ సర్వీసులకు గురువారం నుంచే డిమాండ్‌ పెరిగింది. రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు రెగ్యులర్‌ సర్వీసులు నాలుగు నడుస్తుండగా అదనంగా మరో మూడు ఏర్పాటు చేసినప్పటికీ వాటిల్లో సీట్లన్నీ నిండిపోయాయి. జిల్లాకు చెందినవారిలో ఎక్కువమంది ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. వీరిలో అత్యధికులు హైదరాబాద్‌లో ఉంటుండగా సార్వత్రిక ఎన్నికల్లో వీరంతా ఓటు వేసేందుకు స్వగ్రామాలకు పయనమవుతున్నారు. ఈ నెల 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13న పోలింగ్‌ కావడంతో వరుస సెలవులు రావడంతో ముందుగానే చాలామంది రిజర్వేషన్‌ చేయించుకున్నారు. రద్దీకి అనుగుణంగా రైల్వే, ఆర్టీసీల్లో అదనపు సర్వీసులు పెరగకపోవడంతో చాలామందికి ఆ మూడు రోజులు రిజర్వేషన్‌ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇటు రైళ్లలోనూ ఇప్పటికే రద్దీ పెరగ్గా శుక్రవారం నుంచి మరింత పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం గౌతమి, గోదావరి, విశాఖ, గరీబ్‌రథ్‌, ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లతో పాటు వందేభారత్‌ రైళ్లలో వెయిటింగ్‌ లిస్టు చాంతాడులా పెరిగిపోయింది. ఈ మేరకు అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు