Palnadu: ఈవీఎం ధ్వంసం ఘటన.. ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు

మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది.

Published : 23 May 2024 20:49 IST

అమరావతి: మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం పాల్వాయిగేటు ఈవీఎం ధ్వంసం కేసులో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్‌ వేటు పడింది. పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా ఉన్న సత్తెనపల్లి జూనియర్‌ కళాశాల అధ్యాపకుడు సుబ్బారావును ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సస్పెండ్‌ చేశారు. పోలింగ్‌ అధికారిగా ఉన్న వెంకటాపురం జడ్పీ స్కూల్‌ అసిస్టెంట్‌ షహనాజ్‌ బేగంపైనా చర్యలు తీసుకున్నారు. ఈ ఇద్దరు అధికారులు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారి ఈ మేరకు చర్యలు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు