Jagan Delhi Tour: తొలి వరుసలో జగన్‌.. సీఎంతో మాట్లాడిన జస్టిస్‌ పి.కె.మిశ్ర

నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలోనూ పాలుపంచుకున్నారు.

Updated : 29 May 2023 09:29 IST

దిల్లీ: నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలోనూ పాలుపంచుకున్నారు. తొలివరుసలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ చెంతన ఆశీనులయ్యారు. కొద్దిసేపు హోంమంత్రి అమిత్‌షా పక్కన కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు. అమిత్‌షా దగ్గరకు ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుండడంతో ఆయనతో మాట్లాడే అవకాశం జగన్‌కి పెద్దగా రాలేదు. దాంతో మళ్లీ తన సీట్లోకి వచ్చి కూర్చున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉంటూ ఇటీవలే సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్‌ పి.కె.మిశ్ర దూరాన ఉన్న తన సీట్లోంచి లేచి జగన్‌ వద్దకు వచ్చి కొద్దిసేపు మాట్లాడారు. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కూర్చున్న చోటుకు జగన్‌ వెళ్లి నమస్కరించి వచ్చారు. భాజపా సీనియర్‌ నేతల్లో మురళీమనోహర్‌ జోషి ఒక్కరే పార్లమెంటు భవన ప్రారంభోత్సవంలో కనిపించారు. కొత్త లోక్‌సభలో ఆరు గ్యాలరీలు ఉండగా అన్నీ దేశ, విదేశీ అతిథులతో నిండిపోయాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని