logo

వైకాపా ప్రచారంలో క్షేత్ర సహాయకుడు

ఎన్నికల కోడ్‌ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు.

Published : 29 Mar 2024 03:55 IST

సంజాయిషీ నోటీసు జారీ

శావల్యాపురం, న్యూస్‌టుడే : ఎన్నికల కోడ్‌ వచ్చినా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఒప్పంద సిబ్బంది ఇంకా వైకాపా ప్రజాప్రతినిధులతో కలిసి ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇలాంటి వారిని జిల్లా అధికారులు విధుల నుంచి తొలగిస్తున్నా ఇంకా కొంతమంది సమావేశాలు, ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా శావల్యాపురం మండలం వేల్పూరులో బుధవారం స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కల్యాణ మండపంలో వైకాపా నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీనికి వైకాపా నరసరావుపేట పార్లమెంటు అభ్యర్థి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌తో పాటు, స్థానిక ఎమ్మెల్యే పాల్గొన్నారు. సమావేశం అనంతరం మండలంలోని నాయకులతో పరిచయం చేపట్టారు. దీనిలో మండలంలోని చినకంచర్లకు చెందిన ఉపాధి హామీ క్షేత్రసహాయకుడు ముండ్రు ప్రభు పాల్గొని నేతలతో కరచాలనం చేశారు. ఈ విషయాన్ని ఎంపీడీవో కొర్రపాటి కవితా చౌదరి దృష్టికి తీసుకెళ్లగా అతనికి శ్రీముఖం జారీ చేశామని, జిల్లా డ్వామా పీడీ జోసఫ్‌కుమార్‌కు కూడా ఆధారాలతో తెలియజేశామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని