logo

‘చేనేత కుటుంబాలపై ఎమ్మెల్యే ఆర్కే కక్షసాధింపు’

ఎమ్మెల్యే ఆర్కే తొలి నుంచి చేనేత కుటుంబాలపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌ను గెలిపించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు మహిళా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 17 Apr 2024 04:25 IST

ఎర్రబాలెంలో ఎమ్మెల్సీ అనురాధ ప్రచారం

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఆర్కే తొలి నుంచి చేనేత కుటుంబాలపై విషం కక్కుతున్నారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళగిరి మండలం ఎర్రబాలెంలో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్‌ను గెలిపించాలని కోరుతూ మంగళవారం సాయంత్రం స్థానిక తెలుగు మహిళా నాయకులతో కలసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఆర్కేకు చేనేతలు ఓటు వేయలేదనే కక్షతో చేనేత కార్మికుల కార్యాలయాన్ని కూల్చివేశారన్నారు. కాండ్రు, మురుగుడు కుటుంబాలు సొంతవారికి తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మూడు రాజధానుల పేరిట జగన్‌ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. రాజధాని లేకుండా ఐదేళ్లు పాలించడం సిగ్గుచేటన్నారు. గ్రామాల్లో కనీస సౌకర్యాలు కరవయ్యాయని, భూకబ్జాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం తప్పా ప్రజా సంక్షేమాన్ని వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అనంతరం తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్యతో కలసి సూపర్‌-6 పథకాల కరపత్రాలు పంపిణీ చేశారు. తెదేపా మహిళా అధ్యక్షురాలు ఆరుద్ర భూలక్ష్మి, పద్మజ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని