logo

వారానికోసారే నీరు.. ఇదీ పాలన తీరు..

గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్‌, మదర్‌థెరెసా నగర్‌లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు.

Published : 29 Apr 2024 05:55 IST

రెడ్డిపాలెంలో రెండు వారాలకోసారి వచ్చే ట్యాంకర్‌ల నుంచి డ్రమ్ముల్లో నీరు పట్టుకుంటున్న మహిళలు

గుంటూరు నగరపాలికలో విలీన గ్రామాలైన గోరంట్ల, రెడ్డిపాలెం, ప్రగతినగర్‌, మదర్‌థెరెసా నగర్‌లలో గుక్కెడు నీటి కోసం జనాలు నానా తంటాలు పడుతున్నారు. కాలనీలకు పైపులైన్లు వేసి ఇంటింటికీ కనెన్షన్‌ ఇచ్చి అయిదేళ్లు దాటినా నీటి సరఫరాకు దిక్కులేదు. గోరంట్ల కొండపై 12లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడిన రెండు రిజర్వాయర్లు నిర్మించి ఈ ప్రాంతాలకు కొండమీద నుంచి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలని తెదేపా ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు పూర్తి చేశారు. రూ.33 కోట్లు మంజూరు ప్రకటించినా గుత్తేదారుకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆపేశారు. దీంతో ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటి ముందు నీటి కోసం డ్రమ్ములు ఉంచుకుని వారం నుంచి రెండు వారాలకు ఒకసారి వచ్చే ట్యాంకర్ల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. కార్పొరేషన్‌ నుంచి ఉచితంగా పంపిణీ చేయాల్సిన నీటి ట్యాంకర్‌కు రూ.200 వెచ్చించాల్సి వస్తోంది. చాలీచాలని నీటితో ఏళ్ల తరబడి సతమతమవుతున్నామని పైపులైన్‌ ద్వారా నీటి సరఫరా చేయాలని ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నామని కాలనీవాసులు వాపోతున్నారు.

 ఈనాడు, గుంటూరు

గోరంట్ల కొండపై నిర్మాణంలో రిజర్వాయర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని