logo

ఎన్నికల బరిలో 104 మంది అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది.

Published : 30 Apr 2024 06:22 IST

19 మంది నామినేషన్ల ఉపసంహరణ
రేపల్లెలో అత్యల్పంగా 14 మంది పోటీ
అన్ని నియోజకవర్గాల్లో 15 మంది చొప్పున అభ్యర్థులు

నామినేషన్‌ ఉపసంహరణ పత్రాన్ని ఆర్వో శ్రీధర్‌కు అందజేస్తున్న కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థి పఠాన్‌ రాజేష్‌

బాపట్ల, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 104 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం మధ్యాహ్నం 3 గంటలు తుది గడువుగా ఉంది. ఈనెల 25 నాటికి మొత్తం 151 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 28 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 19 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బాపట్ల లోక్‌సభ స్థానంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టి.రమ్య, దేవరపల్లి పాపారావు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బాపట్ల అసెంబ్లీలో అత్యధికంగా మొత్తం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వేమూరులో ఒకరు,  రేపల్లెలో ఒకరు, పర్చూరులో ఇద్దరు, చీరాలలో ఇద్దరు చొప్పున అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అద్దంకిలో అభ్యర్థులెవరూ నామినేషన్లు ఉపసంహరించలేదు. రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో 14 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బాపట్ల లోక్‌సభతో పాటు మిగిలిన అయిదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని