logo

పోస్టల్‌ బ్యాలట్ల దరఖాస్తులు తీసుకోవడానికి నిరాకరణ

బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 02 May 2024 06:22 IST

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: బాపట్ల జిల్లాలోని వివిధ గ్రామాల్లో ఓటు హక్కు కలిగిన ఒప్పంద ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలట్‌ తీసుకోవడానికి గుంటూరు, బాపట్ల జిల్లాల్లోని తహసీల్దార్లు నిరాకరించడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లాకు చెందిన 300 మందికి పైగా గుంటూరు జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఒప్పంద ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరికి గత నెల 28న ఓపీవో విధులను కేటాయిస్తూ ఉత్తర్వులు అందాయి. అందులో మే 1వ తేదీలోపు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన పోస్టల్‌ బ్యాలట్‌ను సమర్పించాలని ఉంది. దరఖాస్తులను తెనాలి తహసీల్దారు, సబ్‌కలెక్టర్‌ కార్యాలయాలలో అందజేయగా తీసుకోడానికి నిరాకరించారు. వాటిని బాపట్ల జిల్లా వేమూరు తదితర మండలాల తహసీల్దారులకు అందజేయగా వారు తీసుకోమని తేల్చి చెప్పారు. పోస్టల్‌ బ్యాలట్‌ గడువు పూర్తవడంతో ఓపీవో విధుల నుంచి తమను తొలగించి ప్రత్యక్షంగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని