logo

ప్రాణాలు పోతున్నా పట్టదా..!

వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత..

Published : 02 May 2024 06:33 IST

అధికారపార్టీ వైఫల్యంతో తాగునీరు కలుషితం

భాస్కరరావు దిబ్బలో మురుగు నీటిలో కుళాయి

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: వైౖకాపా పాలకుల వైఫల్యం వల్ల ప్రజలు కలుషిత నీరు తాగి అస్వస్థతకు గురవుతున్నారు. అధికార పార్టీ నాయకులు, అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ‘నాకింత.. నీకింత’తో నాసిరకంగా పైపుల మరమ్మతుల పనులు చేస్తున్నారు. ఉదాహరణకు ఇటీవల ఐతానగర్‌ ఎస్‌బీఐ వద్ద పైపు లైన్‌ లీకు మరమ్మతులు చేసిన వారానికే మళ్లీ లీకై నీరు వృథాగా పోతోంది. తెనాలి పట్టణంలో తాగునీటి పైపుల లీకులకు సత్వర మరమ్మతులు చేయకపోవడంతో రంగు మారిన, మురికి నీరు వస్తుందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మూడు నెలల కిందట స్థానిక గురువయ్య కాలనీలో కుళాయి నీరు తాగిన వృద్ధురాలు బండి లక్ష్మి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ మృతి చెందారు. అదే వీధిలో పది మంది అస్వస్థతకు గురికావడంతో వారి బంధువులు అప్రమత్తమై ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించడంతో కోలుకున్నారు. అప్పటి నుంచి  కాలనీలోని జనం కుళాయి నీరు తాగాలంటే భయపడుతున్నారు. స్తోమత ఉన్న వారు బయట కొని తెచ్చుకోగా, ఇతరులు కుళాయి నీటినే కాచి తాగుతున్నారు. పలు చోట్ల మురుగు కాలువలను ఆనుకొని తాగునీటి కుళాయి గొట్టాలు వేశారు. వీటిలో కొన్ని మురుగులో తేలియాడుతున్నాయి. వాటర్‌ ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రపరచక పోవడం, వాల్వులు వద్ద నీరు పొంగి పొర్లడంతో నీరు కలుషితమవుతోంది.

కాచి తాగుతున్నాం

మా కాలనీలో మూడు నెలల కిందట కలుషిత నీరు తాగి వృద్ధురాలు మృతి చెందడం, పలువురు అస్వస్థతకు గురవ్వడంతో అప్పటి నుంచి కుళాయి నీరు కాచి తాగుతున్నాం. చాలీ చాలని నీరు ఇస్తున్నారు. నీటి పన్ను మాత్రం ఏడాదికి రూ.1,200 చొప్పున ముక్కు పింది వసూలు చేస్తున్నారు.

ఎం.శీను, గురవయ్యకాలనీ, తెనాలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని