logo

వైకాపా నేతలపై చర్యలకు డిమాండ్‌

పొన్నూరులో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు హెలీప్యాడ్‌ను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఎ.ఎస్‌.రామకృష్ణ తదితరులు.

Published : 05 May 2024 05:47 IST

సీఈఓ ముకుశ్‌ కుమార్‌ మీనాకు ఫిర్యాదు చేస్తున్న తెదేపా నేతలు

పొన్నూరు, న్యూస్‌టుడే: పొన్నూరులో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల పర్యటనను అడ్డుకునేందుకు వైకాపా నేతలు హెలీప్యాడ్‌ను ధ్వంసం చేశారని, దీనిపై విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెదేపా నేతలు వర్ల రామయ్య, మన్నవ సుబ్బారావు, ఎ.ఎస్‌.రామకృష్ణ తదితరులు శనివారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) ముకుశ్‌కుమార్‌ మీనాకు లిఖత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తెదేపా నేత మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ పొన్నూరు వైకాపా అభ్యర్థి అంబటి మురళీకృష్ణ సూచన మేరకు ఆ పార్టీ నేతలు హెలీప్యాడ్‌ను ధ్వంసం చేశారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్‌ పర్యటనను విఫలం చేసేందుకు వైకాపా నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. హెలీప్యాడ్‌ ధ్వంసానికి తీసుకువచ్చిన లారీకి అనుమతి పత్రాలు లేవని, వాటిపై కూడా విచారణ చేయాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని