logo

‘జగన్‌కు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు వెనుకబడ్డాం’

మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి డాక్డర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు.

Published : 07 May 2024 06:37 IST

కొల్లిపర, న్యూస్‌టుడే : మండలంలోని పిడపర్రు, పిడపర్తిపాలెం, మున్నంగి గ్రామాల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థి డాక్డర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ సతీమణి శ్రీరత్నతో కలిసి సోమవారం పర్యటించారు. తెదేపా ప్రకటించిన సూపర్‌- 6 సంక్షేమ పథకాలను వివరించారు. వైకాపాకు ఒకసారి ఓటేస్తేనే పదేళ్లు అభివృద్ధిలో వెనకబడ్డామని చెప్పారు. మరోసారి ఆ పొరపాటు చేయవద్దని ప్రజలను కోరారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు పలకాలని కోరారు. తెదేపా మండల అధ్యక్షులు భీమవరపు కోటిరెడ్డి, వంగా సాంబిరెడ్డి, మాజీ సర్పంచి యోగానంద ఛటర్జి తదితరులు పాల్గొన్నారు.


బుర్రిపాలేన్ని నమూనాగా తీర్చిదిద్దుతాం

తెనాలి టౌన్‌: ఘన కీర్తి సొంతం చేసుకున్న బుర్రిపాలెం గ్రామాన్ని నమూనాగా తీర్చిదిద్దుతామని, గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ స్వగ్రామం అయిన నేపథ్యంలో ఇద్దరం కలిసి ప్రణాళిక రూపొందించుకొని అమలు చేస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. మండలంలోని బుర్రిపాలెంలో సోమవారం ఆయన పర్యటించి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అంగలకుదురులో డాక్టర్‌ నాదెండ్ల మనోహరం ఇంటింటికి తిరిగి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని నమూనా బ్యాలట్ పేపర్‌ చూపిస్తూ ప్రచారం చేశారు.నాదెండ్ల మిథుల్‌ సంగంజాగర్లమూడిలో టీ గ్లాసులు చూపిస్తూ తమ గుర్తును జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అన్నాబత్తుని జయలక్ష్మి, పెమ్మసాని రాజ్యలక్ష్మి, వీరవల్లి మురళి, కనగాల నాగభూషణం, కనగాల శ్రీనివాసరావు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

 

50 ఏళ్లకే పింఛను
పెదకాకాని, న్యూస్‌టుడే :  మండల పరిధిలోని నంబూరులో సోమవారం నిర్వహించిన ప్రచారంలో తెదేపా కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ సతీమణి జ్యోతిర్మయి  పాల్గొన్నారు. బీసీ,ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను ఇవ్వనున్నట్లు ఆమె చెప్పారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని