logo
Published : 30/11/2021 03:34 IST

బీసీ బంధు అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయాలి


మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య. చిత్రంలో నందు, సుధాకర్‌, వెంకటేశ్‌, గుజ్జ కృష్ణ, శివకుమార్‌, అంజి, జయంతి, మంజుల

కాచిగూడ, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీసీ బంధు అమలుకు మార్గదర్శకాలు ఖరారు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య కోరారు. అందుకు అఖిలపక్ష నేతలు, బీసీ కుల, ఉద్యోగ, యువజన, మహిళ, విద్యార్థి సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీసీ యువజన సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.  నాలుగేళ్ల క్రితం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి రుణాలు మంజూరు చేసేందుకు రూ.5 వేల కోట్లు విడుదల చేయాలన్నారు.   నేతలు నీల వెంకటేశ్‌, సుధాకర్‌, అంజి, శివకుమార్‌ ముదిరాజ్‌, జయంతి, శంకర్‌, మంజుల, భాస్కర్‌, సంతోష్‌కుమార్‌, కృష్ణ, నందు, రాజేందర్‌, శ్రీనివాస్‌, చిన్న, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

క్షేత్ర సహాయకులను విధుల్లోకి తీసుకోవాలి
కవాడిగూడ: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించిన క్షేత్ర సహాయకులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ధర్నాచౌక్‌లో తెలంగాణ ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ సంఘం  నిర్వహించిన దీక్షలో ఆయన మాట్లాడారు.  తె.ఫీల్డ్‌ అసిస్టెంట్స్‌ సంఘం అధ్యక్షుడు చింత కృపాకర్‌, నాయకులు లింగానాయక్‌, చంద్రశేఖర్‌, యాదగిరి, శంకర్‌, సునీల్‌ పాల్గొన్నారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని