logo
Published : 02/12/2021 03:30 IST

16 ఏళ్ల తర్వాత నడక

హిప్‌ జాయింట్‌ దెబ్బతిన్న యువతికి శస్త్ర చికిత్స

కోలుకున్న రేణుకతో వైద్య నిపుణులు డా.వి.కోటేశ్వరప్రసాద్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: బాల్యంలో చెట్టు పైనుంచి కిందపడి నడవలేని స్థితికి చేరిన 21 ఏళ్ల యువతికి సనత్‌నగర్‌లోని రెనోవా నీలిమ ఆసుపత్రి వైద్యులు నడుము జాయింట్‌ మార్చి ఆమెకు పూర్వస్థితిని కల్పించారు. ఎముకల వ్యాధి శస్త్ర చికిత్స నిపుణులు కోటేశ్వరప్రసాద్‌  వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ఎల్గోయి గ్రామానికి చెందిన రేణుక మూడో తరగతి చదువుతున్న వయసులో చెట్టు పైనుంచి కిందపడి నడవలేని స్థితికి చేరింది. తల్లిదండ్రులు    రెనోవా నీలిమ ఆసుపత్రిని ఆశ్రయించారు. కోటేశ్వరప్రసాద్‌, ఇతర వైద్యులతో కలిపి  నడుము జాయింట్‌ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. రేణుక 16 ఏళ్ల తరువాత శస్త్ర చికిత్స అనంతరం తిరిగి నడవగలిగిందని వైద్యులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని