logo

పార్లమెంట్‌లో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టాలి

రానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు డిమాండ్‌ చేశాయి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే అంశంపై తమ ప్రతినిధి బృందం ఈ నెలాఖరున దిల్లీలో ప్రధాని

Published : 18 Jan 2022 02:24 IST

బిర్లామందిర్‌ ప్రధాన అర్చకుడు లక్ష్మీనర్సింహాచార్యులుకు జ్ఞాపిక అందజేస్తున్న జస్మత్‌పటేల్‌.

చిత్రంలో రితీశ్‌ జాగిర్దార్‌, తరుణ్‌మెహతా, ముఖేశ్‌జైన్‌, రాకేశ్‌శర్మ, శంకర్‌

కాచిగూడ, న్యూస్‌టుడే: రానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో గోసంరక్షణ బిల్లు ప్రవేశపెట్టాలని తెలంగాణ గోసంరక్షణ సంస్థలు డిమాండ్‌ చేశాయి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే అంశంపై తమ ప్రతినిధి బృందం ఈ నెలాఖరున దిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రి అమిత్‌షాలను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం కాచిగూడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో గోసంరక్షణకు పాటుపడుతున్న బిర్లామందిర్‌ ప్రధాన అర్చకుడు లక్ష్మీనర్సింహాచార్యులు, పలు ఆలయాల పూజారులను తెలంగాణ లవ్‌ఫర్‌ కౌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌పటేల్‌, ప్రాణిమిత్ర రమేశ్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక కార్యదర్శి రితీశ్‌ జాగిర్దార్‌, అఖిల భారతీయ హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ముఖేశ్‌జైన్‌ తదితరులు సన్మానించారు. గోవధతో వాటి సంతతి క్రమేణా తగ్గిపోయి వ్యవసాయరంగం, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్నారు. గుజరాతీ బ్రాహ్మణ సమాజం రాష్ట్ర అధ్యక్షుడు తరుణ్‌మెహతా, రుద్రాభిషేక్‌ సేవా మండల్‌ అధ్యక్షుడు రాకేశ్‌శర్మ, శంకర్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని