logo

క్షయ నిర్ధారణకు సాంకేతిక సాయం

సాంకేతికత పరిజ్ఞానంతో క్షయ (టీబీ) నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు  క్షయ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌ తెలిపారు. తాండూరులోని పీపీ యూనిట్‌ విభాగంలోని టీబీ కేంద్రాన్ని ఆయన మంగళవారం

Published : 19 Jan 2022 02:43 IST


యంత్రాన్ని పరిశీలిస్తున్న వైద్యాధికారులు

తాండూరు టౌన్‌ (న్యూస్‌టుడే): సాంకేతికత పరిజ్ఞానంతో క్షయ (టీబీ) నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు  క్షయ జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రవీందర్‌ యాదవ్‌ తెలిపారు. తాండూరులోని పీపీ యూనిట్‌ విభాగంలోని టీబీ కేంద్రాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద ప్రభుత్వం రూ.16లక్షల విలువ చేసే అధునిక యంత్రాన్ని మంజూరు చేసినట్లు తెలిపారు. దీన్ని వినియోగించటం, పరీక్షలు చేసే విధానంపై సిబ్బందికి త్వరలోనే శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. తరువాత యంత్రాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు.

కొడంగల్‌ ఆస్పత్రికి యంత్రం

కొడంగల్‌: ప్రభుత్వ ఆసుపత్రికి క్షయ నిర్ధారణ యంత్రం అందించామని టీబీ ప్రోగ్రామ్‌ జిల్లా అధికారి డాక్టర్‌.రవీంద్రయాదవ్‌ తెలిపారు. మంగళవారం కొడంగల్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మాట్లాడుతూ.. గతంలో పరీక్షలు చేయాలంటే మైక్రోస్కోప్‌ ద్వారానే సాధ్యం అయ్యిందని అన్నారు. ప్రస్తుతం రూ.16 లక్షలతో కొనుగోలు చేసిన యంత్రంతో కచ్చితమైన ఫలితం తెలుసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌.గోపాల్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని