Telangana News: కళ్లున్నా కనిపించనట్లుగా మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నేతలు: హరీశ్‌రావు

కాంగ్రెస్ నేతలకు కళ్లున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సనత్‌నగర్‌లోని 50 పడకల ఆస్పత్రిని పరిశీలించి అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.

Updated : 26 May 2022 16:48 IST

హైదరాబాద్: కాంగ్రెస్ నేతలకు కళ్లున్నా ఏమీ కనిపించనట్లుగా మాట్లాడుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సనత్‌నగర్‌లోని 50 పడకల ఆస్పత్రిని పరిశీలించి అనంతరం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వైద్యారోగ్య వ్యవస్థపై బుధవారం కాంగ్రెస్ నేతలు గీతారెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఘాటుగా స్పందించారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అద్భుతంగా అభివృద్ధి చేస్తోందన్నారు. ప్రజారోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్లు వెచ్చిస్తోందని తెలిపారు. మాజీ మంత్రి గీతా రెడ్డి ఒక వైద్యురాలు అయి ఉండి కూడా తెలంగాణ వైద్య రంగంలో జరుగుతున్న అభివృద్ధిని గ్రహించకపోవడం చాలా బాధాకరమన్నారు. సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిని అభివృద్ధి చేస్తే ఎమ్మెల్యే జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా హరీశ్‌రావు గుర్తు చేశారు. కరోనా సమయంలో సీఎం కేసీఆర్.. గాంధీ అస్పత్రిలో అత్యన్నత స్థాయి సౌకర్యాలు కల్పించారని పేర్కొన్నారు. ఉస్మానియా అభివృద్ధికి కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. 70 ఏళ్లలో మూడు కళాశాలలు మాత్రమే ఏర్పాటు చేయడం కాంగ్రెస్ ఘనత అయితే.. 7 సంవత్సరాల్లో 33 కళాశాలలు కట్టిన ఘనత తెరాసదని హరీశ్‌రావు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని