logo

వసతి గృహం.. వెతకడం తేలిక!

నగరానికి కొత్తగా వచ్చి.. లగేజీ మోసుకుంటూ.. నచ్చిన హాస్టల్‌ కోసం వెతకడమంటే కష్టమే. ఎవరైనా ఫలానా హాస్టల్‌ బాగుంటుందని చెప్తే నేరుగా అక్కడికి వెళ్లిపోతుంటారు. ఈ ప్రయాసను తగ్గించేందుకు నగరానికి చెందిన అంకుర సంస్థ పిగో యాప్‌

Published : 27 Jun 2022 02:43 IST

పీజీవో పేరిట సేవలు అందిస్తోన్న అంకుర సంస్థ

ఈనాడు, హైదరాబాద్‌

పీజీవో బృంద సభ్యులు

గరానికి కొత్తగా వచ్చి.. లగేజీ మోసుకుంటూ.. నచ్చిన హాస్టల్‌ కోసం వెతకడమంటే కష్టమే. ఎవరైనా ఫలానా హాస్టల్‌ బాగుంటుందని చెప్తే నేరుగా అక్కడికి వెళ్లిపోతుంటారు. ఈ ప్రయాసను తగ్గించేందుకు నగరానికి చెందిన అంకుర సంస్థ పిగో యాప్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్‌లో విద్యార్థులు, ఉద్యోగులు తమకు కావాల్సిన ప్రాంతంలో హాస్టల్‌, పేయింగ్‌ గెస్ట్‌(పీజీ) గృహాన్ని గుర్తించి వసతి పొందడానికి వీలుగా థింక్‌వైడ్‌ సొల్యూషన్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ‘పేయింగ్‌ గెస్ట్‌ ఆన్‌లైన్‌(పిగో) యాప్‌ను రూపొందించింది. హాస్టళ్లకు, వసతి కావాలనుకునేవారికి మధ్య ఆన్‌లైన్‌ వేదికగా ఇది పనిచేస్తోంది.

రూ.25లక్షల పెట్టుబడితో..
పూర్తిగా సాంకేతికత ఆధారంగా పనిచేసేలా పిగోను రూపొందించామని, రాజధానిలో చిన్నా పెద్దా వసతి గృహాలు 10 వేల వరకు ఉండగా.. 3 వేల హాస్టళ్లు ఈ యాప్‌లో రిజిస్టరయ్యాయని అంకుర సంస్థ నిర్వాహకుడు హరికృష్ణ తెలిపారు. వోడాఫోన్‌ సంస్థలో సీటీవోగా పనిచేసిన ఆయన 2016లో సంస్థ ప్రారంభంపై ఆలోచన మెదిలింది. కార్యరూపం దాల్చేందుకు మూడేళ్లు పట్టింది. తొలుత రూ.25లక్షలు పెట్టుబడిగా పెట్టగా.. వేర్వేరు సంస్థల నుంచి పెట్టుబడులను సమీకరించి ప్రధానంగా నాలుగు నగరాల్లో సంస్థను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నుంచి కోలుకుంటున్న హాస్టళ్ల రంగం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 80 శాతం హాస్టళ్లు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి.

ఫిల్టర్ల ద్వారా నచ్చిన హాస్టల్‌ ఎంపిక..
నచ్చిన హాస్టల్‌ను వెతికే క్రమంలో కూర్చున్న చోటే అందులోని రేటింగ్‌, ధరలు, రివ్యూలు, షేరింగ్‌, ఆహారం, మహిళలకు ప్రత్యేకం, ఏసీ, నాన్‌ ఏసీ, సొంతంగా వంటచేసుకునే సదుపాయం, అద్దె ప్రాతిపదికన, కో లివింగ్‌ తదితర సదుపాయాలను ప్రదర్శిస్తోంది. ఫిల్టర్ల ద్వారా కావాల్సిన హాస్టళ్లను ఎంచుకునే సదుపాయం ఉంది.  

యాప్‌ వివరాలు

* ఉచిత యాక్సెస్‌(గెస్ట్‌, హాస్టల్‌ నిర్వాహకుడు)

* దేశవ్యాప్తంగా 4 లక్షల డౌన్‌లోడ్‌లు.

* నగరంలో 3 వేలు, దేశవ్యాప్తంగా 13 వేల హాస్టళ్లతో అనుసంధానం. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, పుణెల్లో యాప్‌ వినియోగం.

* హైదరాబాద్‌లో ఇప్పటి వరకు 21 వేల బుకింగ్‌లు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని