logo

బతుకమ్మ సంబరాల ఏర్పాట్లపై సమీక్ష

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అక్టోబరు 3న ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Published : 27 Sep 2022 04:08 IST

నాంపల్లి, న్యూస్‌టుడే: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని అక్టోబరు 3న ఎల్బీ స్టేడియం, ట్యాంక్‌బండ్‌ వద్ద నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సోమవారం సాంస్కృతిక, పర్యాటక, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, జలమండలి, ఆర్‌అండ్‌బీ, ఉద్యాన, విద్య, సమాచార, అగ్నిమాపక, ట్రాఫిక్‌ తదితర శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..వివిధ శాఖల తరఫున చేయాల్సిన ఏర్పాట్లు ముందస్తుగానే పూర్తి చేయాలని సూచించారు. డీసీపీ రాజేష్‌, డీఆర్‌వో సూర్యలత, సికింద్రాబాద్‌ ఆర్డీవో వసంతకుమారి, హైదరాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని