logo

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న నగర యాత్రికులు సురక్షితం

నగరం నుంచి వెళ్లిన ఆది కైలాస యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. మలక్‌పేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 24 మంది వారం రోజుల క్రితం మానస సరోవరం సమీపంలోని ఆది కైలాస్‌ యాత్రకు బయల్దేరారు.

Updated : 29 Sep 2022 03:03 IST

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: నగరం నుంచి వెళ్లిన ఆది కైలాస యాత్రికులు ఆందోళనకు గురయ్యారు. మలక్‌పేటతో పాటు వివిధ ప్రాంతాల నుంచి 24 మంది వారం రోజుల క్రితం మానస సరోవరం సమీపంలోని ఆది కైలాస్‌ యాత్రకు బయల్దేరారు. దర్శనం ముగించుకుని తిరుగు పయనమవ్వగా ఉత్తరాఖండ్‌ గుంజీ వద్ద కొండచరియలు విరిగిపడటంతో అక్కడే చిక్కుకుపోయారు. ఆదివారం నగరానికి చేరుకోవాల్సి ఉండగా రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం ఉదయం హెలికాప్టర్‌ ద్వారా మిలటరీ అధికారులు బాధితులందరినీ సురక్షిత ప్రాంతానికి తీసుకువచ్చి ఆహార పదార్థాలు అందించారు. సాయంత్రం వరకు అందరూ దిల్లీకి చేరుకున్నట్లు ఓ యాత్రికుడు ‘న్యూస్‌టుడే’కు ఫోన్‌లో తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని