logo

చిత్ర వార్తలు

బతుకమ్మ సంబరాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కాలనీలతోపాటు కార్యాలయాల్లో వేడుకలు జరిగాయి. ఆడపడుచులు పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడి సందడి చేశారు.

Published : 29 Sep 2022 03:38 IST

పూల హరివిల్లు.. బతుకమ్మ సందళ్లు


ఖైరతాబాద్‌ మింట్‌ కాంపౌండ్‌లో వేడుకలు

బతుకమ్మ సంబరాలు నగరంలో ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం కాలనీలతోపాటు కార్యాలయాల్లో వేడుకలు జరిగాయి. ఆడపడుచులు పూలతో చక్కగా పేర్చిన బతుకమ్మల చుట్టూ చేరి ఆడి పాడి సందడి చేశారు.


మాదాపూర్‌ తెలంగాణ సాంస్కృతిక సారథి కార్యాలయ ప్రాంగణంలో..


అన్నపూర్ణాదేవిగా పెద్దమ్మ తల్లి

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గురువారం గజలక్ష్మీ దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు.

- న్యూస్‌టుడే, జూబ్లీహిల్స్‌


అద్భుతం.. దేవీ వైభవ నృత్యోత్సవం

తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో బతుకమ్మ సంబరాల్లో భాగంగా రవీంద్రభారతిలో నిర్వహించిన ‘దేవీ వైభవ నృత్యోత్సవం’ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా నాట్యగురువులు ప్రదర్శించిన నృత్యాంశాలు ప్రేక్షకులను సమ్మోహితుల్ని చేశాయి.

-న్యూస్‌టుడే, రవీంద్రభారతి


సామగ్రి ఉన్నా సాయం చేసేవారేరీ?

గాంధీ ఆసుపత్రిలో వీల్‌ఛైర్లు ఉన్నా సమయానికి అందజేసే సిబ్బంది కరవయ్యారు. నడవలేని రోగులు ఇబ్బందులు పడుతూనే సహాయకులతో కలిసి వెళుతున్నారు. కొందరు తామే ఉపకరణాలు తీసుకొని రోగులను తీసుకెళుతున్నారు.


రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాదులతో కలిసి బతుకమ్మ ఆడుతున్న ఎమ్మెల్సీ కవిత


గాంధీభవన్‌లో ఎమ్మెల్యే సీతక్క, మహిళా కాంగ్రెస్‌ నగర అధ్యక్షురాలు వరలక్ష్మి, ఉపాధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ తదితరులు


బర్కత్‌పురలోని హైందవి డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థినులు


బతుకమ్మలు పేర్చుతూ నారాయణగూడలో జాహ్నవి మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థినుల సందడి


మాదాపూర్‌లో బతుకమ్మను తెస్తూ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని