logo

ఆడబిడ్డల అవస్థలపై చలించిన కేటీఆర్‌

పీర్జాదిగూడ చెన్నారెడ్డి కాలనీలో నివసించే వెంకటయ్య, శకుంతల దంపతులది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అయిదుగురు కుమార్తెల్లో హేమలత(31), స్వర్ణలత(28),

Published : 05 Dec 2022 04:27 IST

వెంకటయ్య కుమార్తెలను పరామర్శిస్తున్న జక్కా వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ విజయలక్ష్మి

పీర్జాదిగూడ(బోడుప్పల్‌), న్యూస్‌టుడే: పీర్జాదిగూడ చెన్నారెడ్డి కాలనీలో నివసించే వెంకటయ్య, శకుంతల దంపతులది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. అయిదుగురు కుమార్తెల్లో హేమలత(31), స్వర్ణలత(28), మనీష(22) ‘మస్క్యులర్‌ డిస్టోఫ్రి’ సమస్యతో నడవలేరు, నిలబడలేరు. ఈ దీనావస్థను వీడియో తీసిన యువకుడు శివ ముదిరాజ్‌ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేశారు. చలించిన మంత్రి ఆదివారం పీర్జాదిగూడ మేయర్‌ జక్కా వెంకట్రెడ్డిని వారి ఇంటికి పంపించి ఫోన్‌లో పరామర్శించారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌ డైరెక్టర్‌ డా.విజయలక్ష్మి మేయర్‌తో కలిసి ఆ యువతులను పరామర్శించారు. ఆమెతో మంత్రి మాట్లాడి.. యువతులకు మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సూచించారు. కేటీఆర్‌ సూచనతో మేయర్‌ వెంకట్‌రెడ్డి, కార్పొరేటర్లు కె.కుమార్‌, సుభాష్‌నాయక్‌ స్పందించి రూ.లక్ష తక్షణ సాయం చేశారు. కార్పొరేషన్‌లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని