logo

నూతన సచివాలయ భవనం.. తెలంగాణకే తలమానికం

నుమాయిష్‌కు వచ్చే సందర్శకులు రోడ్లు, భవనాల శాఖ స్టాల్‌ను తప్పనిసరిగా సందర్శించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోరారు.

Published : 25 Jan 2023 01:47 IST

స్టాల్‌లో కొత్త సచివాలయం నమూనాను పరిశీలిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

అబిడ్స్‌, న్యూస్‌టుడే: నుమాయిష్‌కు వచ్చే సందర్శకులు రోడ్లు, భవనాల శాఖ స్టాల్‌ను తప్పనిసరిగా సందర్శించాలని మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఎగ్జిబిషన్‌ మైదానంలోని నుమాయిష్‌లో ఆర్‌అండ్‌బీ శాఖ తరఫున ఏర్పాటు చేసిన స్టాల్‌ను మంగళవారం ఆయన ప్రారంభించిన అనంతరం అందులో ప్రదర్శించిన నిర్మాణాల నమూనాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ..దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో కొత్త భవనాల నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణకే తలమానికంగా ఉండేలా సచివాలయం నిర్మాణం, నూతనంగా నిర్మిస్తున్న ఇతర భవనాల నమూనాలను ప్రదర్శించారు.  ఆదిత్య మార్గం, సాయినాథ్‌, దయాకర్‌ శాస్త్రి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని