logo

కారు కంటే ఆటోనే ఖరీదు

గ్రేటర్‌లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్‌ కారు కొనవచ్చు.

Published : 11 Mar 2023 02:41 IST

పర్మిట్ల పేరుతో దళారుల దోపిడీ
వ్యవస్థీకృత దందాగా సాగుతున్న వైనం

గ్రేటర్‌లో కొత్త ఆటో కొనడంకంటే అదే ధరకు కొత్త కారు లేదా మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్‌హ్యాండ్‌ కారు కొనవచ్చు. ఇది నిజం. ఇదంతా ఆటో పర్మిట్లలో జరుగుతున్న దందా. బహిరంగ మార్కెట్‌లో కొత్త ఆటో రూ.2-2.25 లక్షలుంటే గ్రేటర్‌లో కొనాలంటే రూ.4.5-5 లక్షల వరకు చెల్లించాల్సిందే. ఇందులో కేవలం పర్మిట్‌ కోసమే రూ.2.5 లక్షలు వెచ్చించాల్సి వస్తోంది. కొందరు దళారులు పర్మిట్లను తమ గుప్పిట్లో పెట్టుకొని నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు.  

హక్కులు మార్చుకున్నాకే..

కేవలం ఆటోలతోనే కాలుష్యం, ట్రాఫిక్‌ ఇబ్బందులున్నాయంటూ గతంలో ప్రభుత్వం పర్మిట్లను నిలుపుదల చేసింది. 2014కు ముందు కొత్తగా 20 వేల కొత్త పర్మిట్లు విడుదల చేసి ఆపేసింది. ప్రస్తుతం ఆటో కొనుక్కొని తిప్పాలంటే పాత పర్మిట్‌తోనే కొత్తది కొనుక్కోవాల్సి వస్తోంది. ఉదాహరణకు.. ఇప్పటికే ఆటో ఉన్న డ్రైవర్‌ తన ఆటో పాతబడిందని ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి దాన్ని తుక్కుగా మార్చాలి. అప్పుడే రవాణాశాఖ కొత్త పర్మిట్‌ జారీ చేస్తుంది. లేదంటే పాతది కొని యాజమాన్య హక్కులు మార్చుకుని, తుక్కుగా చేసి, అదే పర్మిట్‌తో కొత్తది తీసుకోవాలి.  

అంతా వారి కనుసన్నల్లోనే..

ఎక్కువ శాతం డ్రైవర్లు ప్రైవేటు ఫైనాన్షియర్ల వద్ద రుణాలు తీసుకొని ఆటోలు కొంటుంటారు. కిస్తీలు కట్టలేని సమయంలో తిరిగి ఫైనాన్షియర్లు ఆ ఆటోలను లాక్కుంటారు. వాటిని తిరిగి ఇతరులకు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. యాజమాన్య పేరు మాత్రం పాత డ్రైవర్‌తోనే ఉంటుంది. ఇలా నగరంలో 50 వేలపైనే ఆటోలున్నాయి. కొన్నింటిపై గతంలో ట్రాఫిక్‌ పోలీసులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు పేద ఆటో డ్రైవర్ల నుంచి దళారులు, ఫైనాన్షియర్లు ఎంతోకొంతకు పర్మిట్లు తీసుకొని వాటిని రెండింతల ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. కొందరైతే జిల్లాల్లో ఆటోలను కొని అక్కడే రిజిస్ట్రేషన్‌ చేయించుకొని వాటిని నగరంలో తిప్పుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసుల కంట పడితే చలానా కడుతున్నారు. పర్మిట్ల విధానం వ్యవస్థీకృత దందాగా మారింది. రూ.కోట్ల వర్షం కురిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని