logo

బస్సు జాడ తెలిసేదెలా..?

నగరంలో 29 ఆర్టీసీ డిపోల్లో మూడింటిని పక్క డిపోల్లో కలిపేశారు. నగర విస్తీర్ణం బాగా పెరిగింది. ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ కొత్త నివాసాలు వెలిశాయి. బస్సులు గణనీయంగా తగ్గిపోయాయి.

Published : 27 Mar 2023 00:37 IST

ఊసేలేని వెహికిల్‌ ట్రాకింగ్‌ సిస్టం

ఈనాడు - హైదరాబాద్‌: నగరంలో 29 ఆర్టీసీ డిపోల్లో మూడింటిని పక్క డిపోల్లో కలిపేశారు. నగర విస్తీర్ణం బాగా పెరిగింది. ఔటర్‌ రింగురోడ్డు చుట్టూ కొత్త నివాసాలు వెలిశాయి. బస్సులు గణనీయంగా తగ్గిపోయాయి. ఉన్న వాటితో  నాణ్యమైన సేవలందిస్తామని చెప్పిన శాఖ అధికారులు.. ఆ దిశగా ఒక్క అడుగు పడలేదు. బస్సుల జాడ తెలిపేందుకు వీటీఎస్‌(వెహికల్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)ను అందుబాటులోకి తెస్తామని చెప్పినా.. ఆ ఊసే లేకుండా పోయింది. ప్రతి నెల చివరి సోమవారం ఆర్టీసీ గ్రేటర్‌హైదరాబాద్‌ జోన్‌ అధికారితో పాటు.. ఆర్‌ఎంలు, డీవీఎంలు, డిపో మేనేజర్లు క్రమం తప్పకుండా ‘డయల్‌ యువర్‌ ఆర్టీసీ ఆఫీసర్‌’ కార్యక్రమాలు చేపట్టేవారు. ఈ కార్యక్రమాన్ని సైతం గాలికొదిలేశారు. టీఎస్‌ఆర్టీసీ గ్రేటర్‌జోన్‌లో బస్సులు నడిచే తీరుపై పరీక్షించేవారే కరవయ్యారు. కళాశాలల సమయాల్లో నగర శివార్లలో తూతూమంత్రంగా అధికారులు క్షేత్రస్థాయిలో గమనించడం.. తర్వాత పట్టించుకోకపోవడం జరుగుతోందనే విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని