యువతి జుట్టు పట్టి లాగి.. కిందపడేసి ఈడ్చుకెళ్లిన యువకులు
వాహనంపై వెళ్తున్న యువతిపై కర్రతో దాడి చేయడమే కాకుండా జుట్టు పట్టి లాగి కిందపడేసి ఈడ్చుకెళ్లిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది.
మద్యం మత్తులో దాష్టీకం
జూబ్లీహిల్స్, న్యూస్‌టుడే: వాహనంపై వెళ్తున్న యువతిపై కర్రతో దాడి చేయడమే కాకుండా జుట్టు పట్టి లాగి కిందపడేసి ఈడ్చుకెళ్లిన ఘటన బంజారాహిల్స్ ఠాణా పరిధిలో చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన యువతి(21) అడ్డగుట్ట సొసైటీలోని ఉమెన్స్ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. శనివారం ఆమె ఆరుగురు స్నేహితులతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నంబరు 2లోని బిర్యానీ వాలాకు వెళ్లేందుకు మూడు ద్విచక్రవాహనాలపై బయలుదేరారు. యువతి ఓ బైక్ వెనుక కూర్చున్నారు. జీపీఎస్ ఆధారంగా బేగంపేట వైపు నుంచి బంజారాహిల్స్ రావడానికి ప్రయత్నించగా, పంజాగుట్ట కూడలి దాటిన తరువాత జీపీఎస్ పంజాగుట్ట శ్మశానవాటికపై కొత్తగా వేసిన బ్రిడ్జిపై నుంచి దారి చూపింది. ఆ దారిలో వెళ్తుండగా, మద్యం తాగి ఉన్న ఇద్దరు యువకులు మరో బైక్‌పై వెళ్తూ ఆమెను దుర్భాషలాడారు. వారిని దాటుకొని ముందుకు వెళ్లగా, అటు నుంచి దారి లేకపోవడంతో (జీపీఎస్ తప్పు చూపడంతో) వెనక్కి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో మద్యం తాగి ఉన్న యువకుల్లో ఒకరు ఆమెపై కర్రతో దాడి చేశారు. మరొకడు ఆమె జుట్టు పట్టుకొని లాగడంతో బైక్‌పై నుంచి కిందపడిపోయింది. అలానే జుట్టు పట్టుకొని కొంతదూరం లాక్కెళ్లాడు. స్నేహితులు వెంటనే అప్రమత్తమై వారిని పట్టుకొని బంజారాహిల్స్ ఠాణాకు తీసుకెళ్లి అప్పగించారు. యువకులు పంజాగుట్టకు చెందిన కొండ గోపి(24), పంజాగుట్ట పోచమ్మబస్తీకి చెందిన పుణ్యసాయి కల్యాణ్(25)గా గుర్తించారు. అయితే, అంతకుముందే మరో యువతితో గొడవ జరగడం, కొద్ది సమయం తరువాత అటుగా వచ్చిన ఈమెను అదే యువతిగా భావించి దాడి చేసినట్లు నిందితులు విచారణలో తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lancet Report: తీవ్ర గుండెపోటు/స్ట్రోక్ కేసుల్లో.. మరణాలకు ప్రధాన కారణం అదే!
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Politics News
BJP: ప్రతి నియోజకవర్గంలో 1000 మంది ప్రముఖులతో.. భాజపా ‘లోక్‌సభ’ ప్లాన్
-
India News
Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసు.. నాలుగో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఈడీ
-
Movies News
Randeep Hooda: వీర్ సావర్కర్ పాత్ర కోసం నాలుగు నెలల్లో 26 కేజీలు తగ్గిన హీరో!
-
General News
TSPSC: ప్రశ్నపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం