అన్ని వర్గాల సంక్షేమమే మా అభిమతం: రోహిత్‌రెడ్డి
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం భారాసతోనే సాధ్యమని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా యాలాల మండలంలోని రాస్నం, గంగాసాగర్, సంగాయిపల్లి తండా...
యాలాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమం భారాసతోనే సాధ్యమని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. సోమవారం పల్లెపల్లెకు పైలెట్ కార్యక్రమంలో భాగంగా యాలాల మండలంలోని రాస్నం, గంగాసాగర్, సంగాయిపల్లి తండా, సంగాయిపల్లి మీది తండా, సంగాయిపల్లి కింది తండా, పగిడియాల, బాగాయిపల్లి, అచ్యుతాపూర్ గ్రామాలలో ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తాతో కలిసి రోహిత్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసిఆర్ కృషితో తాండూరు నియోజవర్గానికి మునుపెన్నడూ లేని విధంగా నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాస్నం గ్రామంలో చేపట్టిన పలు పనులను చూసి సర్పంచ్ సురేఖను ఎమ్మెల్యే అభినందించారు. అచ్యుతాపూర్ గ్రామానికి బస్సు రావడం లేదని గ్రామస్థులు వివరించగా, డిపో మేనేజర్‌తో మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రాజుగౌడ్, ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, మండల ఉపాధ్యక్షులు రమేష్, భారాస మండల పార్టీ అధ్యక్షులు రవీందర్‌రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సంఘం అధ్యక్షులు అక్బర్‌బాబా, రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం ఉపాధ్యక్షులు పగిడియాల్ రాములు తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IPL Playoffs: ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. మొత్తం ఎన్ని మొక్కలు నాటబోతున్నారంటే?
-
India News
Rahul Gandhi: రాహుల్ సభలో ఖలిస్థానీ మద్దతుదారుల హల్చల్..
-
General News
Registrations: తెలంగాణలో నిలిచిన కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు
-
India News
గిడ్డంగుల సామర్థ్యం పెంపునకు ₹లక్ష కోట్లు.. కేబినెట్ ఆమోదం
-
Politics News
Nara Lokesh: రాష్ట్ర వ్యాప్తంగా చేనేతను దత్తత తీసుకుంటా: నారా లోకేశ్
-
General News
TTD: జమ్మూకశ్మీర్‌లో జూన్ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే