logo

బోరబండలో భానుడు భగభగ

నగరంలో ఎండ తీవ్రత పెరిగింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటింది.

Published : 30 Mar 2023 02:04 IST

ఈనాడు, హైదరాబాద్‌ : నగరంలో ఎండ తీవ్రత పెరిగింది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 38 డిగ్రీలు దాటింది. బుధవారం బోరబండలో అత్యధికంగా 38.4 డిగ్రీలు, బేగంబజార్‌లో 38.2 డిగ్రీలు నమోదైంది. షేక్‌పేట, జూబ్లీహిల్స్‌, చార్మినార్‌, మల్కాజిగిరి, మైత్రీవనం, రాజేంద్రనగర్‌ ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా నమోదైంది. గత ఏడాది ఇదే రోజు సీతాఫల్‌మండిలో 39.6 డిగ్రీలు నమోదైంది. గురువారం నగరంలో మధ్యాహ్నం లేదా సాయంత్రం సమయంలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల వరకు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కి.మీ. వీచే అవకాశం ఉందని తెలిపారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని