logo

గోవును రాష్ట్ర మాతగా ప్రకటించాలి

చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని బుధవారం వివిధ సంస్థల, సంఘాల ప్రతినిధులు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.

Published : 30 Mar 2023 02:27 IST

భాగ్యలక్ష్మి ఆలయంలో వివిధ సంస్థల, సంఘాల ప్రతినిధులు

చార్మినార్‌, న్యూస్‌టుడే: చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయాన్ని బుధవారం వివిధ సంస్థల, సంఘాల ప్రతినిధులు సందర్శించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గోమాత ఫౌండేషన్‌ ఛైర్మన్‌ జస్మత్‌ పాటిల్‌, తెలంగాణ ప్రాణిమిత్ర రమేష్‌ జాగిర్దార్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ కార్యదర్శి రిదేశ్‌ జాగిర్దార్‌, ఆల్‌ ఇండియా ఓల్డ్‌ టెంపుల్‌ రినోవేషన్‌ ట్రస్టు ఛైర్మన్‌ ఆర్‌.కె.జైన్‌, గుజరాతీ బ్రాహ్మణ సమాజ్‌ అధ్యక్షుడు తరుణ్‌మెహతా, భారతీయ జైన్‌ సంఘటన తెలంగాణ మహిళా విభాగం కార్యదర్శి రంజనా మనీష్‌షా తదితరులు పాల్గొన్నారు. గోమాతను రాష్ట్ర మాతగా ప్రకటించాలని, అయోధ్యలో శ్రీరామ మందిరాన్ని త్వరగా నిర్మించాలని ప్రార్థించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని