ఆర్థిక సహకారం.. అర్హుల ఆనందం
వివిధ వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కుల, చేతి వృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది.
న్యూస్‌టుడే, వికారాబాద్ కలెక్టరేట్, పరిగి: వివిధ వర్గాల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కుల, చేతి వృత్తులు చేసుకునే వారికి రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌ను మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్రస్థాయి అధికారులు ఇటీవల సచివాలయంలో ప్రారంభించారు. దీంతో జిల్లాలో చేతి వృత్తుల వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీరికి ఇప్పటివరకు తగిన ప్రోత్సాహం లభించక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో వారికి ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో ఎక్కువగా నాయీబ్రాహ్మణులు, రజకులు, కుమ్మరి, కమ్మరి, మేదరి, వడ్రంగి, చర్మకారులు, మత్స్యకారులున్నారు. వీరంతా తమ వృత్తులను నమ్ముకుని జీవనయానం చేస్తున్నారు. జిల్లాలో సుమారుగా 30 వేల మంది చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునే వారు ఉన్నారు. వృత్తులు చేయని వారు మరో 40 వేల మంది వరకు ఉంటారు.
20 వరకు దరఖాస్తు గడువు: దరఖాస్తులను స్వీకరణ మంగళవారం ప్రారంభించారు. ఈనెల 20 వరకు సమర్పించేందుకు వీలు కల్పించారు. పత్రం సరళంగా రూపొందించారు. ఆర్థిక సహాయాన్ని అందుకున్న తర్వాత లబ్ధిదారుడు వృత్తి పరికరాలను, ముడి సరుకులను కొనడానికి ఈ నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో టీఎస్‌ఓబీఎంఎంఎస్‌బీసీ.సీజీజీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
విధానం ఇలా..: వెనుకబడిన కులాల, చేతి వృత్తులకు చెందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో ఒక్కరికే అవకాశం కల్పించారు. 2జూన్ 2023 నాటికి 18 నుంచి 55 ఏళ్ల వారు మాత్రమే అర్హులు. లబ్ధిదారు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కన్నా మించవద్దు. గత అయిదు సంవత్సరాల్లో ఇతర పథకాల ద్వారా రూ.50 వేల కన్నా ఎక్కువ మొత్తాన్ని లబ్ధిపొందిన వారు అనర్హులు. మండల స్థాయిలో ఎంపీడీఓలు, పురపాలికల్లో కమిషనర్లు అర్జీలను పరిశీలిస్తారు. ఎంపికైన వారికి 15వ తేదీన ఒకే సారి రూ.లక్ష ఆర్థిక సాయాన్ని విడుదల చేస్తారు.
సద్వినియోగం చేసుకోండి
వెనుకబడిన వర్గాలకు చెందిన వివిధ వృత్తులతో జీవనం చేసే వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. రుణంతో ఆర్థికంగా ఎదగాలి. సద్వినియోగం చేసుకుని భవితను తీర్చిదిద్దుకునేందుకు ఇది మంచి మార్గం. -ఉపేందర్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/09/2023)
-
Vizag: సిగరెట్ కోసం స్నేహితుడినే హతమార్చారు!
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Hyderabad: ప్రముఖ హోమియో వైద్య నిపుణుడు సోహన్‌సింగ్ జోషి మృతి
-
Chandrababu Arrest: చంద్రబాబుకు మద్దతుగా కూకట్‌పల్లిలో నిరసనలు
-
Missing Children: తొమ్మిదేళ్లలో 4.46 లక్షల చిన్నారుల ఆచూకీ లభ్యం: స్మృతీ ఇరానీ