logo

పాతబస్తీని చుట్టేస్తున్న నగరం

పాతబస్తీకి రంజాన్‌ కళ అత్తరులా వ్యాపించింది. రాత్రి అయితే చాలు నగరమంతా పాతబస్తీలో గడుపుతోంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 వరకూ పాతబస్తీలోని మదీన సెంటర్‌ కిక్కిరిసిపోతోంది.

Updated : 01 Apr 2024 05:36 IST

అర్థరాత్రి దాటాకే వ్యాపారం

పాతబస్తీ గుల్జార్‌హౌజ్‌లో షాపింగ్‌ సందడి  

ఈనాడు, హైదరాబాద్‌: పాతబస్తీకి రంజాన్‌ కళ అత్తరులా వ్యాపించింది. రాత్రి అయితే చాలు నగరమంతా పాతబస్తీలో గడుపుతోంది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 వరకూ పాతబస్తీలోని మదీన సెంటర్‌ కిక్కిరిసిపోతోంది. పగలంతా ఎండ వేడితో ఇంట్లోంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి. పాతబస్తీలో మధ్యాహ్నం 2 గంటల నుంచి వ్యాపారం మొదలై తెల్లవారుజాము వరకూ కొనసాగుతోంది. రంజాన్‌ వ్యాపార కళ అడుగడుగునా కనిపిస్తోంది.

తిండితో పాటు.. అలంకరణ వస్తువులు.. పాతబస్తీలో పసందైన ఆహారం, అందుబాటు ధరల్లో కావాల్సిన వస్తువులు దొరుకుతాయి. విద్యుత్‌ దీపాల వెలుగుల్లో రాత్‌బజార్‌ మెరుస్తుంటే రంజాన్‌ ప్రత్యేక వంటకాలైన హలీం, దహీవడ, బిర్యానీ వంటివాటిని నగరవాసులు ఆస్వాదిస్తున్నారు. ఈదుల్‌ఫితర్‌ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్థాయికి తగ్గట్టు కొత్త దుస్తులు ధరించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో దుస్తుల కొనుగోలు చేయడంతోపాటు చెప్పులు, ఆభరణాలను, ఇంటి అలంకరణ వస్తువులను జోరుగా కొంటున్నారు. వీటితోపాటు కుర్చీలు, సోఫాలు, సోఫాకవర్లు ఇలా ఒంటికి, ఇంటికి అందానిచ్చే వస్తువులతో పాటు వంటల్లో వినియోగించే దినుసులు, అక్తర్లు వంటివి బయట మార్కెట్‌ కంటే తక్కువకు పాతబస్తీలో దొరకడంతో రాత్‌బజార్‌లో జోరుగా వ్యాపారం కొనసాగుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని