logo

నాడు అనుచరులు.. నేడు ప్రత్యర్థులు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్‌ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తలపడుతున్నారు.

Published : 17 Apr 2024 02:36 IST

సికింద్రాబాద్‌లో పోటీ ఆసక్తికరం

యూసుఫ్‌గూడ, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆ ఇద్దరూ ఒకప్పుడు పీజేఆర్‌ అనుచరులు. ప్రస్తుత నగర పరిధిలో ఎమ్మెల్యేలు. మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి తలపడుతున్నారు. ఒకరు కాంగ్రెస్‌ తరఫునా, మరొకరు భారాస నుంచి పోటీ చేస్తున్నారు. వారిద్దరే దానం నాగేందర్‌, టి.పద్మారావు.

అసెంబ్లీ ఎన్నికల్లో భారాస నుంచి గెలుపు

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారాస అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి పి.విజయారెడ్డిపై 22,104 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సికింద్రాబాద్‌ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు కాంగ్రెస్‌ అభ్యర్థి సంతోష్‌కుమార్‌పై 45,240ఓట్ల ఆధిక్యం సాధించారు.

ఇద్దరూ కాంగ్రెస్‌ నుంచే..

పద్మారావు 1986లో కార్పొరేటర్‌గా, దానం నాగేందర్‌ 1994లో ఆసిఫ్‌నగర్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ నుంచి పొంది రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ మంత్రులుగా చేశారు. 2023లో భారాస ఎమ్మెల్యేలుగా గెలిచారు.

నగరం నుంచి ఆయనే...

నగరం నుంచి భారాస తరఫున గెలుపొంది అధికార కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఏకైక ఎమ్మెల్యేగా దానం నాగేందర్‌ నిలిచారు. పార్టీ అతడినే సికింద్రాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్‌ ఎంపీ కిషన్‌రెడ్డి సైతం బరిలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ ఆసక్తికరంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని