logo

పాలమూరుకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు?

పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Published : 05 May 2024 03:23 IST

కొత్తకోట కూడలి సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి

ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్‌రెడ్డి  

ఈనాడు, మహబూబ్‌నగర్‌: పాలమూరుకు నరేంద్ర మోదీ చుట్టంలా వస్తారు.. పోతారు.. పదేళ్లుగా ప్రధానిగా ఉన్న ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతానికి చెందిన డీకే అరుణ పాలమూరు పథకానికి జాతీయ హోదా తీసుకురాలేదని, ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్ష పదవిని తెచ్చుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డికి మద్దతుగా శనివారం ముఖ్యమంత్రి కొత్తకోటలో రోడ్‌ షో నిర్వహించారు. బస్టాండ్‌ సమీపంలోని చౌరస్తాలో జరిగిన కూడలి సమావేశంలో సీఎం ప్రసంగించారు. బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని డీకే అరుణ ఎందుకు అడగలేదన్నారు.పాలమూరుకు పరిశ్రమలకు, అభివృద్ధి నిధులకు ఎన్నడైనా కేంద్రాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో వంశీచంద్‌రెడ్డిని, నాగర్‌కర్నూల్‌లో మల్లు రవిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలన్నారు.  

ఆత్మగౌరవానికి జరిగే ఎన్నిక: వంశీచంద్‌రెడ్డి

ఈ ఎన్నికలు వ్యక్తుల మధ్య పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కాదు.. జిల్లా ఆత్మగౌరవానికి, రేవంత్‌రెడ్డి బలాన్ని దిల్లీలో చూపించే ఎన్నిక‘ అని మహబూబ్‌నగర్‌ లోక్‌సభ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి అన్నారు. ఇది పాలమూరు భవిష్యత్తు తరాల కోసం జరిగే ఎన్నిక అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని