logo

రాళ్లే బద్దలవుతుంటే.. రికార్డులెంత

నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 05 May 2024 04:06 IST

పదేళ్ల నాటి ఉష్ణోగ్రతను దాటి.. 44.5 డిగ్రీల భగభగలు

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలో రోజురోజుకు భానుడు మరింత భగ్గుమంటున్నాడు. జీహెచ్‌ఎంసీ పరిధిలో శనివారం రికార్డు స్థాయిలో 44.5 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. 2015లో నమోదైన అత్యధిక 44.3 డిగ్రీల రికార్డు శనివారం బద్దలైంది. సాధారణం కంటే నాలుగు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పదిరోజులుగా గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు తగ్గడం లేదు. రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. ఎండలకు బయటికి వెళ్లాలంటేనే ప్రజలు హడలిపోతున్నారు. అత్యవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయట తిరగవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ దెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో ఉన్నా.. బయట ఉన్నా ఎక్కువ నీరు తాగాలని సూచిస్తున్నారు.

90 మిలియన్‌ యూనిట్లను దాటింది.. ఉదయం నుంచి ఎండ సెగలు కక్కుతోంది. దీంతో ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు 24 గంటలు పనిచేస్తున్నాయి. రాత్రిపూట మాత్రమే ఏసీ వాడే వారు ఉక్కపోతతో ఉదయంపూట సైతం వినియోగిస్తున్నారు. దీంతో కరెంట్‌ వాడకం పెరిగిందని విద్యుత్తు ఇంజినీర్లు చెప్పారు. సిటీలో శనివారం ఒక్కరోజు వినియోగం 90 మిలియన్‌ యూనిట్లను దాటిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని