logo

సీఆర్‌ ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సీఆర్‌ ఫౌండేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఏఐజీ హాస్పిటల్స్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రాజు అన్నారు.

Updated : 06 May 2024 05:45 IST

ప్రారంభోత్సవంలో డాక్టర్‌ పీవీఎస్‌ రాజు, డాక్టర్‌ గుల్లపల్లి ఎన్‌ రావు, దాసరి ప్రసాదరావు

మియాపూర్‌, న్యూస్‌టుడే: పేదలకు మెరుగైన వైద్య సేవలందించే దిశగా సీఆర్‌ ఫౌండేషన్‌ చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమని ఏఐజీ హాస్పిటల్స్‌ వైస్‌ఛైర్మన్‌ డాక్టర్‌ పీవీఎస్‌ రాజు అన్నారు. కొండాపూర్‌లోని సీఆర్‌ ఫౌండేషన్‌లో ఆదివారం సీఆర్‌ ఫౌండేషన్‌ రోటరీ ప్రోలిఫిక్స్‌ డయాగ్నోస్టిక్‌ కేంద్రాన్ని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకులు డాక్టర్‌ గుల్లపల్లి ఎన్‌.రావు, నిమ్స్‌ మాజీ డైరెక్టర్‌, ప్రొ.దాసరి ప్రసాద్‌రావుతో కలిసి ప్రారంభించారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు కె.నారాయణ మాట్లా డుతూ త్వరలో సీఆర్‌ ఫౌండేషన్‌ ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని సంపూర్ణ ‘హెల్త్‌ హబ్‌’గా మారుస్తున్నామన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ దక్కన్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ శరత్‌చౌదరి, అధ్యక్షులు అనిల్‌రామ్‌ చందాని, సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షులు మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రం డైరెక్టర్‌ డా.కె.రజిని, హెల్త్‌ కమిటీ సభ్యులు డా.బి.రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌రావు, ఫౌండేషన్‌ కార్యదర్శులు వెంకటేశ్వర్‌రావు, పి.సంధ్యకుమారి, కోశాధికారి వి.చెన్నకేశవరావు, ఎన్‌ఆర్‌ఆర్‌ పరిశోధన కేంద్రం డైరెక్టర్‌ టి.సురేష్‌, కన్వీనర్‌ కె.అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని