logo

అబ్‌కీ బార్‌ మోదీ సర్కార్‌

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అంబర్‌పేటలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు.

Published : 06 May 2024 04:04 IST

ఎన్నికల ప్రచారాల్లో భాగంగా అంబర్‌పేటలో పద్మశాలీల ఆత్మీయ సమావేశంలో సికింద్రాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి జి.కిషన్‌రెడ్డి మాట్లాడారు. పార్టీ నేతలు గౌతంరావు, వనం రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.


పాతబస్తీ పగ్గాలు చేపడతాం

మాజీ గవర్నర్‌ తమిళిసైతో కలిసి హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత కార్వాన్‌ సబ్జిమండీలో గంగపుత్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. చేపలు, వలలు పట్టుకుని ఆకట్టుకున్నారు.


కారు.. మీరే గెలవాలి సారూ

సికింద్రాబాద్‌ లోక్‌సభ భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్‌, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ బన్సీలాల్‌పేట డివిజన్‌లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. మహిళలు బొట్టు పెట్టి వారికి స్వాగతం పలికారు.


మై అజార్‌.. గెలవాలి నాగేందర్‌

టీపీసీసీ వర్కింగ్‌ కమిటీ అధ్యక్షుడు, టీమ్‌ ఇండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ సికింద్రాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌కు మద్దతుగా బోరబండ బంజారా నగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.


ఈమాత్రం కసరత్తులు అవసరమే

మల్కాజిగిరి లోక్‌సభ భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపునకు ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి చంపాపేట డివిజన్‌లో మార్నింగ్‌ వాక్‌తో ప్రచారం చేశారు. పార్కుల్లో స్థానికులతో యోగాసనాలు చేయించారు.


భువనగిరి బరి.. కమ్యూనిస్టుల గురి

భువనగిరి లోక్‌సభ సీపీఎం అభ్యర్థి జహంగీర్‌కు మద్దతుగా ఆయనతో కలిసి ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు యాచారం మండలంలోని పలు గ్రామాల్లో రోడ్‌ షోలో పాల్గొన్నారు.


ఓటుపై సీనియర్ల అవగాహన

నాగోలు డివిజన్‌ ఫతుల్లాగూడలోని మధురానగర్‌ కాలనీ సంక్షేమ సంఘం, సీనియర్‌ సిటిజన్లు కలిసి ఓటరు చైతన్య అవగాహన ర్యాలీ చేశారు. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ ప్రచారం చేశారు.


అమ్మా.. ఓటేసి అందరితో వేయించు

అభ్యర్థుల కుటుంబ సభ్యులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. భువనగిరి లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున సతీమణి డింపుల్‌రెడ్డి అనాజ్‌పూర్‌లో ప్రచారం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని