logo

మూడోసారీ మోదీయే ప్రధాని: కొండా

ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు.

Published : 07 May 2024 01:33 IST

నవాబ్‌పేట: ప్రధాని మోదీతోనే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుందని, మూడోసారీ మోదీయే ప్రధాని అవుతారని చేవెళ్ల భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి మండల కేంద్రంలోని ప్రధాన కూడలిలో కార్నర్‌ సభలో ప్రసంగించారు. ఈ నియోజక వర్గంపై పూర్తిగా పట్టుందని, నవాబుపేటను నియోజవర్గంలోనే అభివృద్ధిలో ముందుంచుతానన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ రత్నం మాట్లాడారు. మండల పార్టీ, ఇన్‌ఛార్జిలు నరేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, మండల, జిల్లా, రాష్ట్ర నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌, గాలయ్య తదితరులు పాల్గొన్నారు.

మోదీ గెలుపు దేశానికి అవసరమని మాజీ శాసనసభ్యులు కేఎస్‌ రత్నం అన్నారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తరఫున సోమవారం మండలంలోని ఆయా గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జి నరేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.


అసత్య ఆరోపణలు నమ్మొద్దు

పెద్దేముల్‌, న్యూస్‌టుడే: భాజపాపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉప్పరి రమేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.  కొండాపూర్‌ గ్రామానికి చెందిన  యువకులు భాజపాలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి మాట్లాడారు.మండల పార్టీ అధ్యక్షుడు హరీష్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి యాదయ్య గౌడ్‌, మాజీ అధ్యక్షుడు సందీప్‌ కుమార్‌ పాల్గొన్నారు.  


పూడూరు, న్యూస్‌టుడే: ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మరోసారి అవకాశం కల్పించాలంటే ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటువేసి గెలిపించాలని భాజపా జిల్లా ఉపాధ్యక్షుడు, ఫిలిం సెన్సార్‌బోర్డు సభ్యులు మల్లేశ్‌ పటేల్‌ కోరారు. సిరిగాయపల్లిలో సోమవారం ఇంటింటి ప్రచారం చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు రాఘవేందర్‌ నాయకులు అనిల్‌, కృష్ణ, చందు, సత్యనారాయణ, ప్రకాశ్‌ ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని