logo

అసెంబ్లీకి ఓటేసి.. లోక్‌సభకు ముఖం చాటేసి

పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే.

Updated : 07 May 2024 05:45 IST

పార్లమెంటు ఎన్నికల్లో ఓటేయడానికి నిరాసక్తత

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నిక ఏదైనా.. అటు దేశం.. ఇటు రాష్ట్రం, నియోజకవర్గం బాగుపడాలంటే మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంటుంది. రెండు ఎన్నికలకున్న ప్రాధాన్యం ఒకటే. కానీ పోలింగ్‌కు వచ్చేసరికి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసముంటోంది. అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఆశించిన మేర ఫలితం ఉండటం లేదు. 2019 లోక్‌సభ, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శాతాలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది.

పోలింగ్‌ శాతంలో తేడా..

చేవెళ్ల నియోజకవర్గంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 79.04 శాతం.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో 71.02 శాతం ఓట్లు పోలయ్యాయి. సుమారు ఎనిమిది శాతం వ్యత్యాసం ఉంది. ప్రతి నియోజకవర్గంలో 3 నుంచి 6 శాతం ఓట్లు తక్కువగా నమోదయ్యాయి. ఈ తేడా అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తుంది. కొద్ది రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్ల స్పందన ఎలా ఉంటుందోననే ఆందోళన అభ్యర్థుల్లో, అధికారుల్లో నెలకొంది. పోలింగ్‌ శాతం పెంచడానికి యంత్రాంగం వివిధ మార్గాల్లో విస్తృత ప్రచారం చేపట్టింది. కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పా ట్లు చేస్తున్నారు. అవగాహన, ఓటరు చైతన్య కార్యక్రమాలు  నిర్వహిస్తున్నా... అవన్నీ పోలింగ్‌ కేంద్రాలకు ఎంతవరకు తీసుకొస్తాయోననే అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ఎండలు మండిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది.


వ్యత్యాసానికి కారణాలు..

  • ఉపాధి నిమిత్తం రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో వస్తుంటారు. వీరికి రెండు చోట్ల ఓటు హక్కు ఉంటుంది. ఏపీలో రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతుండటంతో ఓటేయడానికి చాలామంది వెళ్తుంటారు. ఆ ప్రభావం కచ్చితంగా పోలింగ్‌ శాతంపై పడుతోంది.
  • అభ్యర్థుల ప్రచారంలోనూ తేడా కనిపిస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల పరిధి ఎక్కువగా ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసే అవకాశం ఉండటం లేదు. స్థానిక నేతలు సైతం ఉత్సాహం చూపడం లేదు.
  • సంపన్నులున్న ప్రాంతాల్లోనే తక్కువ పోలింగ్‌ నమోదవుతోంది.
  • యువత ఎన్నికల తేదీని సెలవు రోజుగా భావిస్తున్నారు.
  • క్యూలో నిలబడి వేయడానికి ఆసక్తి చూపకపోవడం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు