logo

అంధ విద్యార్ధి ఇంటి వద్ద శౌచాలయం నిర్మించండి

డిల్లీలోని జాతీయ న్యాయ కళాశాలలో మూడో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌కు చెందిన అంధ విద్యార్ధి మాల అభిషేక్‌ తన ఇంట్లో శౌచాలయం లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ అక్కడి అసెస్‌బిలిటి కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు.

Published : 09 May 2024 01:50 IST

కలెక్టర్‌కు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశం

వికారాబాద్‌, న్యూస్‌టుడే: డిల్లీలోని జాతీయ న్యాయ కళాశాలలో మూడో సంవత్సరం న్యాయ విద్య అభ్యసిస్తున్న వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం కొర్విచెడ్‌కు చెందిన అంధ విద్యార్ధి మాల అభిషేక్‌ తన ఇంట్లో శౌచాలయం లేక పడుతున్న ఇబ్బందులను ఏకరువు పెడుతూ అక్కడి అసెస్‌బిలిటి కమిటీకి దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తును పరిశీలించిన నోడల్‌ అధికారులు వెంటనే  తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వికారాబాద్‌ జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు పంపించారు. దీనికి న్యాయ సేవాధికార సంస్థ జిల్లా అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం స్పందించారు. అంధ విద్యార్ధి ఇంటి దగ్గర స్వచ్ఛ భారత్‌ పథకంలో శౌచాలయం మంజూరీ చేయించి, నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డిని ఆయన ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు