logo
Published : 29/11/2021 06:39 IST

ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

మాట్లాడుతున్న ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌

పెండ్లిమర్రి, న్యూస్‌టుడే: ఆశా కార్యకర్తలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ కమలాపురం ఏరియా మహా సభను ఆదివారం పెండ్లిమర్రిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనీస వేతనం అమలు చేయాలని, అర్హత కలిగిన వారికి ఉద్యోగోన్నతి కల్పించి ఏఎన్‌ఎంలుగా నియమించాలని డిమాండు చేశారు. ఉద్యోగ విరమణ అనంతరం పింఛన్‌ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌, ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుభాషిణి, అయ్యవారమ్మ, కమలాపురం ఏరియా అధ్యక్ష, కార్యదర్శులు శ్రీదేవి, కల్పన తదితరులు పాల్గొన్నారు.

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని