AP New Districts: ‘రాయచోటి’ మాకొద్దు.. రాజంపేటలో విద్యార్థుల భారీ నిరసన

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య

Updated : 27 Jan 2022 12:13 IST

రాజంపేట: ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయడంపై రాజంపేటలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజంపేట వైకాపా మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘జిల్లా కేంద్రంగా రాయచోటి వద్దు.. రాజంపేట ముద్దు’ అంటూ రాజంపేట బస్టాండ్‌ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ జిల్లాల విభజనతో రాజంపేటకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. వనరులు ఉన్నచోటే అభివృద్ధి సాధ్యమని గ్రహించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థులు, ప్రజలు శాంతియుతంగా నిరసన తెలిపి రాజంపేట జిల్లాను సాధించుకోవాలన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని