logo
Published : 01/12/2021 03:46 IST

దుకాణాలు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు

సిరిసిల్లపట్టణం, న్యూస్‌టుడే

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాలను రాబట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. కొత్తవారికి మద్యం దుకాణాలు రాగా వారికి గుడ్‌విల్‌ ఆశ చూపుతున్నారు. ఒకవేళ వినకపోతే బెదిరింపులకు వెనకాడటం లేదని చర్చ సాగుతోంది. జిల్లాలో మద్యం మాఫియా పటిష్ఠమైంది. మద్యం వ్యవస్థ తమ చేతిలో నుంచి బయటకు వెళ్లవద్దనే ఆలోచనతో ఎంతకైనా తెగించడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడి నుంచి తామే జిల్లాలో మద్యం దుకాణాలను నడిపించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తదుపరి సిండికేట్‌ అయి ప్రజలను దోచుకోవచ్చనే ఆలోచనలో మద్యం మాఫియా గుడ్‌విల్‌ ఎంతైనా ఇవ్వడానికి ప్రయత్నాలు సాగిస్తుంది. జిల్లా పరిధిలో 48 మద్యం దుకాణాలకు 900ల దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులు తక్కువ వచ్చిన కోనరావుపేట మండలం నిమ్మపల్లి, రుద్రంగి మద్యం దుకాణాల వేలం వాయిదా వేశారు. మిగిలిన 38 దుకాణాలకు లక్కిడ్రా పూర్తిచేశారు. డిసెంబర్‌ 1వ తేది నుంచి కొత్త వ్యాపారుల అధీనంలో దుకాణాల నిర్వహణ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దుకాణాలు చేజారిన పాత వ్యాపారులు మళ్లీ దుకాణాలను దక్కించుకోవడానికి అనేక ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

కొనసాగుతున్న బేరసారాలు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో మద్యం దుకాణాలను తిరిగి దక్కించుకోవడానికి అనేక మంది దుకాణాలు దక్కిన వారితో బేరసారాలు సాగిస్తున్నారు. దుకాణం దక్కించుకోవడానికి ఎంతైనా సరే గుడ్‌విల్‌ ఇచ్చుకునే ప్రయత్నంలో మద్యం వ్యాపారులు ఉన్నారు. మద్యం వ్యాపారంలో నిష్ణాతులుగా కొంతమంది గుడ్‌విల్‌ ఇస్తూ మద్యం దుకాణాలను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్‌ 1వ తేది నుంచి కొత్త దుకాణాలు మొదలు అవుతుండడంతో ఒకే రోజు అవకాశం ఉండగా మద్యం వ్యాపారులు గుడ్‌విల్‌ ఇస్తూ దుకాణాలు దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఓ మద్యం దుకాణానికి భారీ డిమాండ్‌ ఉండేది. కొత్త వ్యక్తికి ఈ దుకాణం లక్కిడ్రాలో రాగా మద్యం వ్యాపారుల కన్ను అతనిపై పడింది. వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి గుడ్‌విల్‌ ఇస్తామంటూ బేరం ఆడారు. ఆఖరుకు రూ.62లక్షలు గుడ్‌విల్‌ ఇచ్చి ఒప్పించి దుకాణాన్ని దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఒక మద్యం దుకాణానికి గుడ్‌విల్‌ రూ.62లక్షలు ఇస్తున్నారంటే ఈ మద్యం దందాలో ఎంత సంపాదిస్తున్నారో చూస్తూనే తెలిసిపోతుంది. జిల్లాలో ఇలా అనేక మద్యం దుకాణాలకు గుడ్‌విల్‌ ఇస్తూ మద్యం వ్యాపారులు దక్కించుకున్నారు. జిల్లాలో ఈసారి రిజర్వేషన్‌లు పెట్టడంతో చాలా చోట్ల మద్యం దందాలో చక్రం తిప్పిన వ్యాపారులకు కాకుండా సామాన్యులకు అవకాశం లభించింది. తమ ఆధిపత్యాన్ని తిరిగి నిలబెట్టుకోవడం కోసం మద్యం వ్యాపారులు ఎలాగైనా సరే మద్యం దుకాణాలను దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.


నిబంధనల ప్రకారమే లక్కి డ్రా నిర్వహించాం

-చంద్రశేఖర్‌, ఎక్సైజ్‌ సీఐ సిరిసిల్ల

గుడ్‌విల్‌ పేరిట దుకాణాలు దక్కించుకోవడం మా పరిధిలోకి రాదు. లక్కిడ్రాలో ఎవరి పేరిట అయితే మద్యం దుకాణం వస్తుందో.. ఆ వ్యక్తి అన్నింటికి బాధ్యుడవుతాడు. వ్యాపారంలో అంతర్గత విషయాల్లో మాకు సంబంధం లేదు. లైసెన్స్‌ కలిగిన వ్యక్తిని ఎవరైనా బెదిరింపులకు గురిచేసిన, భయపెట్టిన అతను లిఖితపూర్వకంగా పూర్తి ఆధారాలతో ఫిర్యాదుచేస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు చేపడతాం.

Read latest Karimnagar News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని