logo

ఇంటి నుంచే నామినేషన్‌

ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం

Published : 19 Apr 2024 04:24 IST

సువిధ యాప్‌తో అవకాశం

న్యూస్‌టుడే, తెలంగాణచౌక్‌(కరీంనగర్‌):  ఎన్నికల ప్రక్రియను సులభతరం చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఓటరు నమోదు, ప్రచార సభలు, సమావేశాల నిర్వహణకు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు వీలు కల్పించడంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇంటి నుంచే నామపత్రాలు దాఖలు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందుకోసం ఎన్నికల సంఘం suvidha.eci.gov.in యాప్‌ను ప్రవేశపెట్టింది.

గడువులోగా అధికారి చేతికి..

ఈ నెల 18 నుంచి 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి నామపత్రాలు స్వీకరిస్తారు. అభ్యర్థులు నేరుగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి సమర్పించడం లేదా ఆన్‌లైన్‌ ద్వారా అందించే వీలుంది. ఎన్నికల సంఘం రూపొందించిన యాప్‌లో కమిషన్‌ సూచించిన వివరాలు నమోదు చేసి, ధ్రువపత్రాలు జత చేయాలి. ఆస్తుల వివరాలు, అఫిడవిట్‌ పత్రాలు, నామినేషన్‌ బలపరిచేందుకు పది మంది వివరాలు నమోదు చేయాలి. అవసరమైన పత్రాలు సమర్పించిన తర్వాత  వాటిని ప్రింట్‌ తీసి నామినేషన్‌ దాఖలుకు గడువులోగా స్లాట్‌ బుక్‌ చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో సమర్పించిన పత్రాలతో మూడు సెట్లు జిల్లా ఎన్నికల అధికారిని కలిసి అందజేయాలి. నామినేషన్ల పరిశీలన, గుర్తుల కేటాయింపు సమయంలో అభ్యర్థులు అందుబాటులో లేకుంటే వారి మద్దతుదారులు హాజరుకావచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని