logo

మోదీ బహిరంగ సభ విజయవంతానికి పిలుపు

వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ  ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు.

Published : 01 May 2024 02:53 IST

స్థలాన్ని పరిశీలించిన బండి సంజయ్‌

వేములవాడలో స్థలాన్ని పరిశీలిస్తున్న ఎంపీ బండి సంజయ్‌, జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి తదితరులు

వేములవాడ, న్యూస్‌టుడే: వేములవాడ పట్టణంలో మే 8న జరగనున్న ప్రధాని నరేంద్రమోదీ  ఎన్నికల బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలో జరిగే బహిరంగ సభ ఏర్పాట్లకు సంబంధించి బైపాస్‌ రోడ్డులోని బాల్‌నగర్‌ మైదానం, గుడి చెరువు కట్టకింద ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌, హెలిప్యాడ్‌లను భాజపా జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణతో కలిసి ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సభ వేదిక వద్ద వాహనాల పార్కింగ్‌, వసతులు, ట్రాఫిక్‌ ఇబ్బంది వంటి వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆశీస్సులుంటాయి కాబట్టి మేమందరం కలిసి వేములవాడకు రావాలని ప్రధాని మోదీని కోరినట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన సభావేదిక, జన సమీకరణ చేయాల్సి ఉందన్నారు. ఎండలు బాగా ఉన్నందున వచ్చే జనానికి పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోడ్‌ ఇబ్బంది లేకుంటే మోదీ ఆ రోజు ఉదయం 8 గంటలకే రాజన్నను దర్శించుకునే అవకాశం ఉందన్నారు. ఈ విషయాన్ని ఆలయ అధికారులతో మాట్లాడినట్లు చెప్పారు. మోదీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, పార్లమెంట్‌ నియోజకవర్గ కన్వీనర్‌ ప్రవీణ్‌రావు, వేములవాడ, సిరిసిల్ల నియోజక వర్గాల బాధ్యులు చెన్నమనేని వికాస్‌రావు, రాణి రుద్రమరెడ్డి, ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమ్మరి శంకర్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్‌, అల్లాడి రమేశ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్‌, అసెంబ్లీ కన్వీనర్‌ మార్త సత్తయ్య, వివిధ మండలాల పార్టీ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని