logo

68 మందిపై అనర్హత వేటు

2019లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు.

Published : 01 May 2024 02:14 IST

2019లో నిజామాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి అత్యధికంగా 185 మంది అభ్యర్థులు పోటీ చేయగా వీరిలో వివిధ పార్టీల నుంచి ఏడుగురు బరిలో దిగగా, మిగతా వారు స్వతంత్రులు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తరువాత నెల రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చు వివరాలను ఎన్నికల సంఘానికి అప్పగించాలి. నిజామాబాద్‌లో లెక్కలు అప్పగించని 68 మందికి నోటీసులు జారీ చేశారు. ‘10ఏ రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్స్‌ యాక్ట్‌ 1951’ ప్రకారం వీరు మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేస్తూ 2021 జూన్‌ 23న జీవో జారీ చేశారు.

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని