logo

పదిలో ఎనిమిదో స్థానం

జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం,

Published : 01 May 2024 03:14 IST

గతేడాది కన్నా ఒక మెట్టు పైకి

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌ : జిల్లా పదో తరగతి ఫలితాల్లో అధికారుల సమష్టి సహకారంతో 96.32 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జిల్లాలో 102 జడ్పీ ఉన్నత, 7 ఆదర్శ, 10 కస్తూర్బా, 6 మహాత్మా జ్యోతిబా, 1 తెలంగాణ గురుకులం, 6 సాంఘిక సంక్షేమ, 3 మైనార్టీ గురుకులాలు, 77 ప్రైవేటు పాఠశాలల్లో 7,716 మంది విద్యార్థులకు 7,432 ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్టడీ మెటీరియల్‌ను ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వెనకబడిన విద్యార్థులను దత్తత తీసుకోవడంతో గతేడాది కంటే స్పల్పంగా ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది రాష్ట్రంలో 9వ స్థానం ఉండగా ప్రస్తుతం 8వ స్థానంతో ఒక మెట్టు పైకి ఎగబాకింది.

49 పాఠశాలల్లో  శతశాతం..

జిల్లాలో సర్కారు బడులు, గురుకులాలు, ఆదర్శ, కస్తూర్బా పాఠశాలలు ఉత్తీర్ణతలో సత్తాచాటాయి. జిల్లా వ్యాప్తంగా 120 ప్రభుత్వ ఆధీనంలో పాఠశాలలు ఉండగా వీటిలో 49 చోట్ల శతశాతం ఉత్తీర్ణత సాధించాయి. అంతర్గాం, ధర్మారం, ముత్తారం ఆదర్శ పాఠశాలలు, రామగిరి, ఓదెల, అంతర్గాం, ముత్తారం, శ్రీరాంపూర్‌, రామగుండం కస్తూర్బా, పెద్దపల్లి, మంథనిలలో మైనార్టీ గురుకులాలున్నాయి. 10 జీపీఏ సాధించడంలో విద్యార్థులు నిరాశ పరిచారు. ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలల్లో 10 మంది మాత్రమే జీపీఏ సాధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని